VZM: ఈనెల 19న MPP, వైస్ MPP, కోఆప్షన్ సభ్యుల ఎన్నికల కార్యక్రమానికి హాజరుకావాలని చీపురుపల్లి MPDO సురేష్ స్దానిక MLA కళా వెంకటరావును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని MLA సూచించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నిక కార్యక్రమానికి ఎమ్మెల్యేకు MPDO ఆహ్వానం


