హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాలుగు నెలలుగా వెలగని వీధిలైట్లు

అన్నమయ్య: రాజంపేట మండలం తాళ్లపాక సిద్దులపల్లెలో నాలుగు నెలలుగా వీధిలైట్లు పనిచేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చెరువుగట్టు నుంచి నాగులగుట్ట వరకు 25 వీధిలైట్లు వెలగడం లేదని వాపోయారు. పంచాయతీ కార్యదర్శికి తెలిపినా స్పందన లేదని ఆరోపించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని కొత్త బల్బులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.