హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో జోరుగా పంచాయతీ నామినేషన్లు

సత్యసాయి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. ధర్మవరం డివిజన్‌లోని ఏడు మండలాల్లో 114 సర్పంచ్ స్థానాలకు 522, వార్డు స్థానాలకు 1,003 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్, వార్డు స్థానాలకు కలిపి మొత్తం 1,525 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.