హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్భుతం.. సుద్దముక్కపై అమరావతి వైభవం

E.G: రాష్ట్ర రాజధాని అమరావతిపై తూర్పుగోదావరి జిల్లా తీపర్రుకు చెందిన ఎంబీఏ విద్యార్థి కోడూరి నాగ సూర్య రాఘవేంద్ర అద్భుత మైక్రో ఆర్ట్‌ను రూపొందించారు. సుద్దముక్కపై అమరావతి పేరుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పటాన్ని సూక్ష్మంగా చెక్కి తన కళా నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అమరావతి రాజధానిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.