కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిందని కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. 66 డివిజన్లతో పాటు మేయర్ పదవికి 28 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఈనెల 19 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాకినాడలో నామినేషన్ల స్వీకరణ పూర్తి: కమిషనర్


