హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన నూరిఫాతిమా

గుంటూరు: తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ వైసీపీ కార్పోరేటర్ మాదాసు ఉషారాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని వైసీపీ ఇంఛార్జ్ నూరిఫాతిమా ప్రారంభించారు. నూరిఫాతిమా మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కరించాలని కార్పోరేటర్ ఉషారాణికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.