పల్నాడు: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సత్తెనపల్లి డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో 150 సర్పంచ్, 1,562 వార్డులకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 3,75,710 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరణ, 24 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. 29న పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి!


