కడప: వెనుకబడిన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు జిల్లాలో మరో 16 పాఠశాలలకు రూ.12 లక్షల విలువైన PAL ల్యాబ్ పరికరాలను పంపిణీ చేశారు. దీంతో జిల్లాలో ఈ ల్యాబ్ల సంఖ్య 54 నుంచి 70కి చేరింది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు గణితం, తెలుగు, ఆంగ్లంలో డిజిటల్ విద్యాబోధన అందించనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని APC అనురాధ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 70 పాఠశాలల్లో PAL ల్యాబ్లు


