హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అవుకు మండలంలో మంత్రి పర్యటన

NDL: అవుకు మండల కేంద్రంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూటమి నాయకుల ఐక్యత, సర్పంచ్ అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ గురించి ఆయన నాయకులు కార్యకర్తలతో చర్చిస్తారు. కావున కూటమి నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.