పల్నాడు: నరసరావుపేట(M) కొండకావూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వార్డు సభ్యురాలిగా నామినేషన్ వేసేందుకు కోటప్పకొండలోని కేంద్రానికి వెళ్తున్న టీడీపీ మహిళా కార్యకర్త దేశబోయిన కుమారిని మార్గమధ్యలో అడ్డుకుని, నామినేషన్ పత్రాలు లాక్కొని దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో గాయపడిన కుమారిని చికిత్స నిమిత్తంనరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కొండ కావూరులో మహిళపై దాడి.


