హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అత్యవసర సాయం కోసం ఇలా చేయండి: కలెక్టర్

కోనసీమ: 'అక్వాన్' తుఫాన్ నేపథ్యంలో కోనసీమలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. అత్యవసర సహాయం 112, 1070, 18004250101 సంప్రదించాలని తెలిపారు. 'మన మిత్ర' వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా సహాయం పొందవచ్చన్నారు.