హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేవీపల్లెలో ఎన్నికలపై పోలీసుల నిఘా

అన్నమయ్య: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేవీపల్లె మండలంలోని  మినంరెడ్డి గారిపల్లి, జంగంపల్లి గ్రామాల్లో ఎస్సై బి. వెంకట శివకుమార్ పర్యటించారు. ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఎలాంటి గొడవలు, ఘర్షణలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడుతూ, ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలన్నారు.