హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బి.కొత్తకోటలో మూడో రోజు 13 నామినేషన్లు

అన్నమయ్య: బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికలకు సోమవారం మొత్తం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. మదనపల్లె దొంతి వీధిలో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ నామినేషన్ కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఛైర్మన్ అభ్యర్థులుగా వైసీపీ నుంచి సాయి వాసవి, జనసేన నుంచి ఖలీల్ అహ్మద్ నామినేషన్ వేశారు.