హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీడీఏ ఎదుట పోలవరం నిర్వాసితుల ఆందోళన

ASR: పోలవరం ప్రాజెక్టు గిరిజన నిర్వాసితులు సోమవారం రాత్రి చింతూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికారులు తమకు ఆమోదయోగ్యం కాని, జీవనానికి అనువుగా లేని ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అన్ని విధాలా అనుకూలమైన, ఆమోదయోగ్యమైన ప్రాంతంలోనే పునరావాసం కల్పించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు.