హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో నేడు నో ఫ్లైయింగ్ జోన్

విజయవాడ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో విజయవాడలో సోమవారం నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రకటించారు. అంబేడ్కర్ కళావేదిక, సూర్యారావుపేట స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, బెలూన్లు ఎగరేయడం నిషేధం. ఉల్లంఘిస్తే విమాన చట్టం కింద చర్యలు తీసుకుని పరికరాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.