హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇన్‌స్టాలో పరిచయం.. నగలు మాయం

విశాఖ అక్కయ్యపాలెంకు చెందిన మానేపల్లి నీరజకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మహిళ పరిచయమైంది. అనారోగ్యమంటూ నీరజ ఇంటికి వచ్చి రోజుల తరబడి మకాం వేసింది. అదను చూసి బీరువాలోని 11.3 గ్రాముల డైమండ్ నెక్లెస్ సహా బంగారు ఆభరణాలు గుట్టుగా ఎత్తుకెళ్లింది. నగలు కనిపించకపోవడంతో బాధితురాలు ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.