ఆరోగ్యంగా ఉండాలంటే సాయంత్రం వేళ తీసుకునే స్నాక్స్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య చిరుతిళ్లు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. వేయించిన శనగలు, పల్లీలు, పండ్లు, మొలకలు, ఉడికించిన గుడ్లు, మొక్కజొన్న మంచి ఎంపికలని సూచిస్తున్నారు. సమోసాలు, బజ్జీలు, చిప్స్, కేకులు, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు.
ఆరోగ్యం
స్నాక్స్ ఏ టైమ్‌లో తినాలి?


