హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక ఎప్పుడంటే..?

GNTR: తెనాలి మండల పరిషత్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు ఈనెల 19న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలుత కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక నిర్వహించి, అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు చేపడతామని ఎంపీడీవో అత్తోట దీప్తి సోమవారం తెలిపారు. అదే రోజు ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం, నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలను నిర్వహిస్తామని వెల్లడించారు.