E.G: అనపర్తి– బలభద్రపురం రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఓ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం... ముగ్గురికి గాయాలు


