హైదరాబాద్: 28°C
క్రీడలు

మరోసారి SKY విధ్వంసం

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 82 పరుగులు బాదాడు. ఇందులో 9 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. దీంతో 198 పరుగుల లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలోనే ఛేదించింది. అంతకుముందు హైదరాబాద్‌పై కూడా 21 బంతుల్లో 60 పరుగులు సాధించి సత్తా చాటాడు.