హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరిలోవ క్రైమ్ పోలీసుల చాకచక్యం

VSP: రవీంద్రనగర్ వద్ద తన బ్యాగులు, విలువైన వస్తువులు పోయాయంటూ పెద్ద వాల్తేరుకు చెందిన సింహాద్రి ఆరిలోవ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు, ఆయన ప్రయాణించిన కారులోనే వాటిని మరిచిపోయినట్లు గుర్తించారు. అనంతరం ఆ కారులోని 3 బ్యాగులు, తులం పావు బంగారు ఆభరణాలు, రూ.3 వేల నగదు, విలువైన పత్రాలను సురక్షితంగా బాధితుడికి అప్పగించారు.