NLR: బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారి ఈ నెల 20న నెల్లూరు-తుని మధ్య తీరం దాటనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి. మీ వేగంతో కదిలిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి 650 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 730 కిలోమీటర్ల దూరంలో ఉంది. గురు, శుక్రవారాల్లో తీవ్ర తుఫాన్ ప్రభావం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తీవ్ర తుఫాన్.. ఎంత దూరంలో ఉందంటే?


