హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కార్యాలయంలో వీరంగం

AKP: అచ్యుతాపురం టీడీపీ కార్యాలయంలో సర్పంచ్ ఆశావహులతో సమావేశంలో, పూడిమడక నేత మేరుగు బాపునాయుడు 80 మందితో వచ్చి కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేశారు. లాలం రాజు, యండ్ర అప్పలనాయుడిపై దాడి చేశారు. వీడియో తీసిన విలేకరిపై దాడి జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. పూడిమడక సర్పంచ్ స్థానం కేటాయింపుపై విభేదాలే కారణమన్నారు.