హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెడికో-లీగల్ కేసులపై శిక్షణ

విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యులు, పోలీసు అధికారులకు మెడికో-లీగల్ కేసుల నిర్వహణపై సోమవారం శిక్షణ ఇచ్చారు. కేసుల నమోదు, పోస్టుమార్టం విధానాలు, సాక్ష్యాల సేకరణ, భద్రత, క్రిమినల్ చట్టాలు, బాధితుల పరీక్షలు, న్యాయస్థానాల్లో సాక్ష్యంపై అవగాహన కల్పించారు. వైద్యులు, పోలీసుల మధ్య సమన్వయం పెంపొందించడమే కార్యక్రమ లక్ష్యమని ఫోరెన్సిక్ విభాగం తెలిపింది.