VZM: బంగారు, వెండి ఆభరణాలకు మెరుగులు పెడతామంటూ గ్రామాల్లో సంచరించే అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం ఎస్పీ దామోదర్ సోమవారం సూచించారు. వారి మాయమాటలు నమ్మి ఆభరణాలు ఇవ్వవద్దని, గుర్తింపు కలిగిన దుకాణాల్లోనే శుభ్రం చేయించుకోవాలని కోరారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు, 100, 112 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆభరణాల మెరుగుల పేరుతో మోసాలు'


