హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సాయంత్రానికి తుపాను

VSP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం సోమవారం సాయంత్రానికి తుపానుగా బలపడనుంది. ప్రస్తుతం విశాఖకు 730 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై గంటకు 17 కి.మీ. వేగంతో కదులుతోందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం తీవ్ర తుపానుగా, శుక్రవారం మధ్యాహ్నానికి అతి తీవ్ర తుపానుగా మారి నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.