హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూఫాన్ బాధితులకు న్యాయం చేయాలని నిరసన

కోనసీమ: గత నెలలో సంభవించిన పెను తుఫాను కారణంగా రాజోలు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాలపై తక్షణమే విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని కోనసీమ జన చైతన్య వేదిక అధ్యక్షుడు తాడి సత్యనారాయణ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన నాయకులతో కలిసి రాజోలు ఎంపీడీవో వెంకటేశ్వరరావు, తహశీల్దార్ మల్లేశ్వరరావు‌కు వినతిపత్రం అందజేశారు.