హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాధవరంపోడులో సర్పంచ్ నామినేషన్ సందడి

అన్నమయ్య: కోడూరు మండలం మాధవరంపోడు సర్పంచ్ అభ్యర్థిగా తాడి చిన్నయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీఎన్ బ్రదర్స్, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.