హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన డీఎస్పీ

SKLM: ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని సోమవారం మధ్యాహ్నం DSP ధనుంజయ నాయుడు సందర్శించారు. సిఐ సన్యాసినాయుడు, ఎస్సై బాలరాజుతో మాట్లాడి స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షించాలని ఆదేశించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ముందస్తు వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టాలని సూచించారు.