PLD: పిడుగురాళ్ల అయ్యప్పనగర్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ మండల పూజా మహోత్సవంలో సోమవారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా సింహద్వారానికి ఇరువైపులా నూతనంగా ఏర్పాటు చేసిన 'క్షేమ', 'లాభ' గ్రానైట్ ఏనుగు విగ్రహాలను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పూజా మహోత్సవంలో పాల్గొన్న గురజాల ఎమ్మెల్యే


