హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

కోనసీమ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండం‌గా బలపడిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్‌ల వల్ల ఒరిగిపోయి ప్రమాదకరంగా మారిన చెట్లను ముందుగానే గుర్తించి వాటిని తొలగించే పనులను చేపట్టాలన్నారు.