ఉమ్మడి వరంగల్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ ప్రజల రిలే నిరాహార దీక్షలు 100 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గ్రామస్థులు నారాయణపూర్ నుంచి గంగాధర ఎక్స్‌రోడ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. గ్రామాన్ని పూర్తిస్థాయి ముంపు గ్రామంగా ప్రభుత్వం ప్రకటించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ పాదయాత్రలో గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
100వ రోజుకు చేరిన నారాయణపూర్ గ్రామస్తుల దీక్ష


