హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిరుమల గార్డెన్‌కు రూ.10 వేల జరిమానా

SDPT: హుస్నాబాద్ పట్టణంలో నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించడంతో పాటు, కొత్త చెరువులో చెత్త పారవేసిన తిరుమల గార్డెన్ యాజమాన్యానికి మున్సిపల్ అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు. కమిషనర్ టీ. మల్లికార్జున్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ అధికారి రవికుమార్, జవాన్ పైసా శ్రీకాంత్ పాల్గొన్నారు.