హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ నూతన డీఆర్వోగా అనిత బాధ్యతల స్వీకరణ

విశాఖపట్నం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా ఎస్.డి.అనిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారుల సమక్షంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా రెవెన్యూ శాఖకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహిస్తానన్నారు.