హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

17వ డివిజన్ కూటమి అభ్యర్థినిగా భోగి శ్రావ్య నామినేషన్

GNTR: మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల సందడి జోరుగా సాగుతోంది. 17వ డివిజన్ కూటమి బలపరిచిన అభ్యర్థినిగా భోగి శ్రావ్య సోమవారం నామినేషన్ వేశారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి వచ్చి ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించారు. నిబంధనల మేరకు ప్రక్రియ పూర్తి చేశారు. డివిజన్‌లో కూటమి గెలుపు ఖాయమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.