హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖాసాపేట సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు

VZM: లక్కవరపుకోట మండలం, ఖాసాపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.​నామినేషన్ దాఖలు చేయడానికి ముందుగా, ఆమె రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను అధికారికంగా అందజేశారు.