SKLM: టెక్కలిలో శ్యామసుందరస్వామి ఆలయంలో సోమవారం మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. వేకువజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవింద నామస్మరణ, వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి పూజలు చేపట్టారు. కార్తీకమాసంలో మూలవిరాట్‌పై సూర్యకిరణాలు ప్రసరించడం శుభపరిణామమని అర్చకులు పద్మన్ పండా తెలిపారు. భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
శ్యామసుందరస్వామిని తాకిన సూర్యకిరణాలు


