హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు

SKLM: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు అయినట్లు జిల్లా పంచాయతీ అధికారి స్వరూపరాణి సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 - 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న పరిశీలన, 22న అప్పీళ్లు, 23న అప్పీళ్ల పరిష్కారం, 24న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం 29వ తేదీన ఉ. 7 నుంచి మ. 1 గంట వరకు పోలింగ్ జరగనుంది.