హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

కృష్ణా: కోడూరు శివారు నరసింహపురం సమీపంలోని ఆక్వా చెరువుల వద్ద విషాద ఘటన చోటుచేసుకొంది. సోమవారం పొలం వద్దకు పోనమాల వెంకటేశ్వరరావు (52) వెళ్లగా, పక్కనే ఉన్న ఆక్వా చెరువుల వద్ద దోనేపూడి గోపాలకృష్ణకు కరెంట్ షాక్ తగిలి అరిచాడు. పక్కనే ఉన్న పోనమాల వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణను షాక్ నుంచి తప్పించే ప్రయత్నంలో కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు.