హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వన మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

WG: మొగల్తూరులోని భ్రమరాంబ సమేత వన మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పొటెత్తారు. కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రసాదం వితరణ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు.