SRD: సిర్గాపూర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఆండాలమ్మ సోమవారం తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగే ఈ కార్యక్రమానికి MLA సంజీవరెడ్డి హాజరై పింఛన్ పత్రాలను పంపిణీ చేస్తారని చెప్పారు. మండలంలోని సర్పంచులు, కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు హాజరు కావాలన్నారు.
తెలంగాణ
రేపు పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ


