కోనసీమ: మండపేట ఏడిద రోడ్డులోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వేగుళ్ల అజయ్ కుమార్ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మండపేటలో పోలేరమ్మ ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన


