హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ప్రధాని మోడీ తల్లి పేరిట ఆలయం

KRNL: ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ పేరిట ఎమ్మిగనూరు మండలం గుడికల్‌లో ఆలయం నిర్మించనున్నారు. ఇక్కడ దేవతా మందిరాలతో పాటు అనాథ శరణాలయం, గోశాల నిర్మిస్తారు. మాతా శ్రీ మందిరం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆలయానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథితో పాటు బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు.