హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముప్పాళ్లలో అనంతా ప్లైవుడ్ పరిశ్రమకు శంకుస్థాపన

NTR: ముప్పాళ్లలో నూతనంగా ఏర్పాటు చేయనున్న అనంతా ప్లైవుడ్ పరిశ్రమకు సోమవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పరిశ్రమతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని ఎమ్మెల్యేలు ఆశాభావం వ్యక్తం చేశారు.