హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ నుంచి టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక

ఎన్టీఆర్: ఏ.కొండూరు మండలం కంభంపాడులో వైసీపీకి చెందిన సుమారు 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మచ్చికంటి రాజశేఖర్ (రాజా), మెంతుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఎంపీ చిన్ని వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.