హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా భారత సంప్రదాయ వేడుక ఛత్ పూజ

MDCL: కొత్తూరు మున్సిపాలిటీలో ఉత్తర భారత సంప్రదాయ వేడుక 'ఛత్ పూజ' ఘనంగా నిర్వహించారు. సూర్య భగవానుడు, షష్టి దేవి కృపకోసం భక్తులు దీక్షతో ఈ పూజ చేపట్టారు. మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు జండగూడెం సుదర్శన్ గౌడ్ ఈ వేడుకల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలను రక్షించే దేవిగా సూర్య భగవానుని సోదరి అయిన షష్టి దేవిని పూజిస్తారన్నారు.