హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలుగొట్లలో చేతబడి ఆనవాళ్ల కలకలం

KRNL: ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేగింది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థి కురువ చంద్రశేఖర్ ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చేతబడి చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఉదయం ఇంటి ముందు క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఇలాంటి చర్యలతో తనను భయపెట్టలేరని వైసీపీ అభ్యర్థి  చంద్రశేఖర్ అన్నారు.