GNTR: తెనాలి మండలంలో 2026 రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీడీవో అత్తోట దీప్తి సోమవారం క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. కొలకలూరు, కటివరం పంచాయతీల్లోని అన్ని పోలింగ్ స్టేషన్లను ఆమె పరిశీలించారు. కేంద్రాల్లో మౌలిక వసతులపై అధికారులను ఆరా తీశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొలకలూరు, కటివరంలో పోలింగ్ కేంద్రాల తనిఖీ


