హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ వన్ టౌన్ పరిధిలో 5 వాహనాలు సీజ్

విశాఖ: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయాన్నే పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది ఈ తనిఖీలు నిర్వహించి, రికార్డులు లేని 5 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. అనధికారికంగా మద్యం అమ్మకాలు, డ్రగ్స్ రవాణా లేదా వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.