BHPL: చిట్యాల మండలం నుంచి టేకుమట్లకు వెళ్లే మార్గంలోని కైలాపూర్ గ్రామ సమీపంలో ఈత చెట్టుపై గిజిగాడు పక్షులు నిర్మించుకున్న గూళ్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గడ్డి, పీచుతో అల్లిన వేలాడే గూళ్లు వాటి అద్భుతమైన నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అటుగా వెళ్లే ప్రయాణికులు ఈ ప్రకృతి అందాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
తెలంగాణ
ఈత చెట్టుపై గిజిగాడు గూళ్లు


